Posts

30 శాతం ఫిట్మెంట్?

72 గంటల్లో పీఆర్సీ పై తుది నిర్ణయం ఆంధ్ర ప్రదేశ్  ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ ప్రకటిస్తారని ప్రభుత్వ సియెస్ సమీర్ శర్మ తెలిపారు. ఇది ఇలా ఉండగా పీఆర్సీ కమీటీ ప్రభుత్వవాని కి నివేదిక సమర్పించింది. 27 శాతం ఫీట్మెంట్ కమీటీ ప్రతిపాధించినట్లు తెలుస్తుంది. అయితే 30 శాతం వరకు ఫీట్మెంట్ పెంచాలని జగన్ నిర్ణయించిన్నట్లు సమచారం.

పీసీసీ కొత్త ప్రెసిడెంట్ వేట లో కాంగ్రెస్

Image
కాంగ్రెస్ అధిష్టానం ఆంధ్ర ప్రదేశ్ పై దృష్టి సారించింది. ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ ని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తుంది. ఈ బాధ్యతల ను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ ఉమెన్ చాందీ కి అప్పగించింది. ఈ మేరకు చాంది ఆంధ్రప్రదేశ్సి కాంగ్రెస్ ముఖ్య నాయకులు అందరి ని విజయవాడ చేరుకోవాలి అని ఆదేశాలు జారి చేశారు. ఈ నెల 21,22 తేదీ ల లో కీలక సమావేశాలు జరుగనున్నాయి.

ముంచుకొస్తున్న థర్డ్ వేవ్

Image
న్యూ ఢిల్లీ, ఆంధ్ర చైతన్య : థర్డ్ వేవ్ ముంచుకొస్తుంది. ఓమిక్రాన్ రూపం లో మరో సారి కరోనా భారత్ లో పంజా విసరనుంది. రోజు రోజు కి పెరుగుతున్న కేస్ లు ఆందోళన కలిగిస్తున్నాయి. మహా రాష్ట్ర, కేరళ మరియు ఇతర రాష్ట్రాల్లో కేస్ లు భారీ గా పెరుగుతున్నాయి. భవిష్యత్తు లో కేస్ లు మరింత పెరగొచ్చు అని ఇది థర్డ్ వేవ్ కి సంకేతం గా భావించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోవిడ్ నిబంధనలు పాటించాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలిపింది.

నిరసన ర్యాలీలు

Image
ఒంగోలు , ఆంధ్ర చైతన్య : ఉద్యోగులు ఉపాధ్యాయులు తమ డిమాండ్ల సాధన కి భోజన విరామ సమయం లో తమ పాఠశాలలు, కార్యాలయాల లో నల్ల బ్యాడ్జి ల తో నిరసన ర్యాలీలు నిర్వహించారు. దీని లో భాగం గా ఒంగోలు నగర పాలక సంస్థ ఉపాధ్యాయులు యూటీఎఫ్ నగర ప్రధాన కార్యదర్శి సి హెచ్ లక్ష్మీ నారాయణ  నాయకత్వం లో వివిధ పాఠశాల లో నిరసన ర్యాలీలు జరిగాయి.  ప్రధాన డిమాండ్లు : 1. పీఆర్సీ తక్షణమే ప్రకటించాలి. 2. డీఏ బకాయిల విడుదల చేయాలి. 3. యాప్ ల భారం తగ్గించాలి. ఒంగోలు లో జరిగిన ఉపాధ్యాయుల నిరసన చిత్రాలు :    పీవీఆర్ గర్ల్స్ హై స్కూల్ ఒంగోలు    డీఆరార్ మునిసిపల్ హై స్కూల్ ఒంగోలు   పీవీఆర్ బాయ్స్ హై స్కూల్ ఒంగోలు   రామనగర్ మునిసిపల్ హై స్కూల్ ఒంగోలు

ఆర్ ఆర్ ఆర్ ట్రైలర్ థియేటర్స్ లో విడుదల

Image
మార్కెటింగ్ లో దిట్ట అయిన రాజమౌళి  ఆర్ ఆర్ ఆర్ ట్రైలర్ తో అంచనాలను రెట్టింపు చేయాలనే ఆలోచన లో భాగం గా థియేట్రికల్ ట్రైలర్ ను తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ లో డిసెంబర్ 9 నా విడుదల చేయనున్నారు. ఎన్టీఆర్ మరియు చరణ్ అభిమానుల కోసం ఆంధ్ర చైతన్య ట్రైలర్ విడుదల కాబోయే థియేటర్స్ లిస్ట్ ని మీ కోసం అందిస్తుంది.

పేదల కోసం 5 శాతం భూమి

అమరావతి, ఆంధ్ర చైతన్య : ప్రైవేట్ లే ఔట్స్ లో పేదల గృహ నిర్మణం  కు 5 శాతం భూమి ని కేటాయిస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైస్సార్ జగనన్న హోసింగ్ ప్రాజెక్ట్ కింద ఈ  ప్రక్రియ అమలు కానుంది. దీని కి సంబంధించిన గెజిట్ ను పట్టణాభివృద్ధి మరియు పురపాలక ప్రత్యేక అధికారి శ్రీ లక్ష్మి సోమవారం విడుదల చేశారు. 

తెలుగు రాష్ట్రల్లో భారీ గా తగ్గిన సిమెంట్ ధరలు

అమరావతి , ఆంధ్ర చైతన్య : నిర్మాణ రంగం లో ఉన్న వారి కి ఇల్లు నిర్మిస్తున్న వారి కి శుభ వార్త. తెలుగు రాష్ట్రాల్లో సిమెంట్ ధరలు భారీ  గా తగ్గాయి. 50 కిలో ల బస్తా పై 20-40 రూపాయలు తగ్గినట్లు సమాచారం. ఈ ధరల తగ్గింపు తో 50 కిలో ల సిమెంట్ బస్తా 320 మరియు అంత  కన్నా తక్కువ కె ప్రజల కి లభిస్తుంది. ఇది కచ్చితం గా నిర్మాణ రంగం లోని వారి కి మరియు సామాన్యుల కు మంచి శుభ వార్త.