ఒంగోలు, ఆంధ్ర చైతన్య : పివిఆర్ బాలుర ఉన్నత పాఠశాల లో సైనిక వికలాంగుల కోసం విరాళాలు సేకరించడం జరిగింది. సోమవారం పాఠశాలలో ఉపాధ్యాయుల నుంచి, విద్యార్థుల నుంచి, ప్రజల నుంచి సుమారు 20 వేళా రూపాయలు సేకరించారు. ఈ మొత్తాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాధిక చేతుల మీదుగా 34వ ఆంధ్రా బెటాలియన్ NCC కమాండింగ్ అధికారికి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా హెచ్ యం రాధిక మాట్లాడుతూ NCC ప్రభోధిస్తున్న దేశభక్తి, క్రమశిక్షణ ఆదర్శాలు ఇటువంటి సహాయం అందజేయడం ఒక ప్రతీక అన్నారు. NCC అధికారి పివి నారాయణ ఈ సహాయం అందజేసిన ఉపాధ్యాయులను, విద్యార్థులను అభినందించారు. ఈ విరాళం పాఠశాల విద్యార్థుల, ఉపాధ్యాయుల సంఘీభావానికి, సమైక్యతకు, దేశభక్తి ప్రేరణకు, సైనిక వికలాంగుల ఆత్మ విశ్వాసాన్ని దోహదపడుతుందన్నారు. సీనియర్ ఉపాధ్యాయులు లక్ష్మీనారాయణ మాట్లాడుతులు ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థులలో సాంఘీక సేవా కార్యక్రమాలు చేసేందుకు, దేశ రక్షణకు దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు రామకృష్ణయ్య, యస్ వెంకటేశ్వర్లు, జి శ్రీనివాస్, ఎన్ సింగయ్య, ఏడుకొండలు, స్టాలిన్, పద్మావతి, అరుణశ్రీ, శ్రీలక్మి, శోభమణి, భవాని, క...